• Tue. Feb 4th, 2025

అక్షర న్యూస్ : దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించిన సిద్దిపేట ఏసీపీ మధు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్..

Bypentam swamy

Oct 11, 2024

అక్షర న్యూస్ : రేపు జరుగు దసరా పండుగ సందర్భంగా రంగదాంపల్లి చౌరస్తాలో హనుమాన్ టెంపుల్ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సిద్దిపేట ఏసీపీ మధు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ దేవాలయం కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా సిద్దిపేట ఏసిపి మధు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రంగదాంపల్లి చౌరస్తా హనుమాన్ టెంపుల్, నర్సాపూర్ గ్రామ శివారు హనుమాన్ టెంపుల్, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా హనుమాన్ టెంపుల్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దసరా సందర్భంగా టెంపుల్ లకు వచ్చే ప్రజలు రాజీవ్ రహదారి మెయిన్ రోడ్ దాటవలసి ఉన్నందున అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకొని రోడ్డు దాటాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండాజరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రోడ్డుపై స్టాపర్స్ ఏర్పాటు చేయాలని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కు సూచించారు.దర్శనానికి వచ్చే భక్తులు ప్రజలు ప్రజాప్రతినిధులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ఆనందోత్సవాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, రంగదాంపల్లి వార్డ్ కౌన్సిలర్ రేణుక తిరుమల్ రెడ్డి,ఆలయ కమిటీ మెంబర్లు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..