అక్షర న్యూస్ :మందమర్రిలో నకిలీ నోట్ల కలకలం
మందమర్రి పట్టణంలో నకిలీ నోట్లు శుక్రవారం కలకలం సృష్టించాయి పాల చెట్టు ఏరియాలో కూరగాయల సంత నిర్వహిస్తారు. ఎప్పటిలాగే హోల్ సేల్ వ్యాపారం చేసే పవన్ కుమార్ సంతలో చిరు వ్యాపారులకు కూరగాయల సరఫరా చేసి వారి వద్ద నుంచి తనకు రావాల్సిన డబ్బులను తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి డబ్బులు లెక్కిస్తుండగా అందులో ఐదు నకిలీ 200 రూపాయల నోట్లు వచ్చినట్లు పవన్ తెలిపారు.



