• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : పగడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..

Bypentam swamy

Nov 9, 2024

అక్షర న్యూస్ : ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి సర్వే ఎన్యూమరేటర్లను ఆదేశించారు.

నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో నేడు జిల్లా కలెక్టర్ సిద్దిపేట మున్సిపాలిటీ లోని 33 వ వార్డు, కొండపాక మండలం దుద్దెడ గ్రామం మరియు ములుగు మండల కేంద్రంలో పర్యటించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ను పర్యవేక్షించి మొదటి రోజు కాబట్టి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటార్లను అడిగి తెలుసుకుని ఇబ్బందులు ఉంటే సూపర్వైజర్లకు మరియు ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటికి స్టిక్కరింగ్ వేయడం పూర్తి చేశామని ఈరోజు నుండి ప్రభుత్వం నిర్దేశించిన ఫారం లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ మరియు కుల వివరాలను ప్రతి కుటుంబం నుంచి సేకరించి నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

ఈరోజు మొదటి రోజు కాబట్టి ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వివరాలను పొందుపరచాలని అన్నారు. దాదాపు 57కు పైగా అంశాలలో వివరాలను నమోదు చేయవలసి ఉన్నందున ఎమ్యూనరేటర్ కు ఒక సహాయకులను నియమించుకుంటే బాగుంటదని సూచించారు. ప్రతి ఒక్క బ్లాకు కు ఒక ప్రత్యేక ఎన్యుమరేటర్ ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలని అన్నారు. అన్ని స్థాయిల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వేలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఈ సర్వే వలన ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి అవకాశం మెరుగవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు అందించి వివరాలను నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్ వెంట సిద్దిపేట ఆర్డీవో సదానందం, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, కొండపాక తాసిల్దార్ దిలీప్ కుమార్, గజ్వేల్ ఆర్డిఓ చంద్రకళ, ములుగు తహసిల్దార్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..