• Fri. Mar 14th, 2025

అక్షర న్యూస్ : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు..

Bypentam swamy

Oct 30, 2024

అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను రాష్ట్రం లోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ దీపాల కాంతులతో ప్రతీ ఇంటింటా సుఖ, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా, పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అక్షర న్యూస్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి శుభాకాంక్షలు తెలిపారు..

అక్షర న్యూస్ : ఢిల్లీలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ కొత్వాల్ దయానంద్..