అక్షర న్యూస్ :సిద్దిపేట పెద్ద కోడూర్ గ్రామ శివారులో ఉన్న సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి వీక్లీ పరేడ్ పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, గారు సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది.
ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు.