అక్షర న్యూస్ : తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల రాక నిరంతరంగా కొనసాగింది. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతరకు భారీగా భక్తులు తరలిరావడంతో లాల్ బజార్లో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్ గా మారింది. ప్రధాన మార్గంలో వానాలకును మళ్లిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.

