అక్షర న్యూస్ : పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యతని, రాబోయే వినాయక చవితి వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులనే పూజించాలని జై గణేశ భక్తి సమితి రాష్ట్ర సభ్యుడు, సామాజిక వేత్త పెంటం స్వామి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ లష్యంగా ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు.
ప్రధాన ముఖ్యాంశాలు:
మట్టి గణపతుల పూజ: తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు మరియు గ్రామ పంచాయతీలలో మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు నిర్వహించాలి.
ఉచిత పంపిణీ: పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం ఈ ప్రచార లక్ష్యం.
ముందస్తు ఆర్డర్లు అవసరం: మట్టి విగ్రహాల తయారీకి సహజ సిద్ధంగా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి విగ్రహాలు కావలసిన భక్తులు కనీసం రెండు నెలల ముందే సమీపంలోని మట్టి గణపతి తయారీ కేంద్రాలలో ఆర్డర్ ఇవ్వడం మంచిది.
ప్రభుత్వ అవగాహన: ప్రజలలో మట్టి గణపతుల వాడకంపై మరింత చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
”పర్యావరణ పరిరక్షణలో మనమందరం భాగస్వాములై, ప్రకృతికి హాని కలిగించని రీతిలో పండుగలను జరుపుకుందాం” అని పెంటం స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
