అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లకి 05 రోజులు జైలు శిక్ష తో పాటు రూ. 10,000/- జరిమానా..
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు, తన సిబ్బందితో కలిసి నిన్నటి రోజు వాహనాలు తనిఖీ చేయగా ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినారు వారిని ఈ రోజు *సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి ఇరువురుకి చెరి రూ, 10,000/- జరిమానా తో పాటు చెరి 05 రోజుల జైలు శిక్ష విధించినారు.*
*జైలు శిక్ష విధించిన వ్యక్తుల వివరాలు*
1.కాసార్ల మల్లేశం నివాసం తోగుట గ్రా. సిద్దిపేట జిల్లా
2.చుక్కల రవి, నివాసం.పశ్చిమ గోదావరి జిల్లా.
*ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ చెట్టుక్రింది ముత్యం రాజు మాట్లాడుతూ*
- ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడుపరాదని త్రాగి వాహనం నడపడం వలన తమ ప్రాణాలకి హాని జరగడమే కాకుండా ఇతరుల ప్రాణాలకి ముప్పు ఉన్నందున, రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం అందరూ బాధ్యత కలిగిన పౌరులుగా మెలగాలని ఒకవేళ మద్యం త్రాగి వాహనం నడుపుతూ పోలీస్ కి పట్టుబడితే రూ. 10,000/- మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 5,000/- జరిమానా తో పాటు జైలు శిక్ష వంటి చట్టపరమైన కఠిన చర్యలకి భాద్యులు కావాల్సి ఉంటుంది..
