• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : రోడ్డు భద్రతపై అవగాహన కోసం గాలిపటాల పండుగ: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్..

Bypentam swamy

Jan 21, 2026

అక్షర న్యూస్ :రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ‘ అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నేడు కమిషనరేట్ పరేడ్ మైదానంలో ఘనంగా గాలిపటాల పండుగను నిర్వహించారు. ఈ వేడుకకు గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మెరిడియన్ స్కూల్, అంబిటస్ స్కూల్, వికాస్ హైస్కూల్ మరియు సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోలీస్ కమిషనర్ స్వయంగా విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ “ప్రాణం ఎంతో విలువైనది. గాలిపటం ఎగురవేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కూడా అంతే ఏకాగ్రతతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలని” విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు.

గాలిపటాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు కమిషనర్ గారు స్వయంగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పాఠశాలల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) కుశాల్కర్ గారు , అదనపు డీసీపీ ( ఎ ఆర్ ) సుభాష్ చంద్రబోస్, అన్ని డివిజన్ ఏసిపి లు , ఇన్స్పెక్టర్ లు , ఎస్ ఐ లు ,పోలీస్ సిబ్బంది మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..