అక్షర న్యూస్ :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు భాగంగా
సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు సిద్దిపేట ట్రాఫిక్ అధికారులు సంయుక్తంగా సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్స్ , మరియు క్యాబ్ డ్రైవర్స్ కి తమ వాహనంలో ప్రయాణించే ప్రయాణికులతో మరియు తోటి వాహనదారులతో రహదారిపై మెదులుకునే విధానం గూర్చి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా అసిస్టెంట్ మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, కచ్చితంగా ప్రతి ఆటో లేదా క్యాబ్ డ్రైవర్ వాహనంకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. క్యాబ్ డ్రైవర్ ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని అదేపనిగా విశ్రాంతి లేకుండా వాహనం నడపడం వల్ల *రహదారి హిప్నాసిస్* (High way hypnosis)కి గురి అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని సమయానుసారం విశ్రాంతి తీసుకుని ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరు డ్రైవర్లకి రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ గాని క్యాబ్ డ్రైవర్ గాని ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనం నడపకూడదని పట్టుబడిన సమక్షంలో లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్, హోంగార్డ్ లు వెంకటేష్ రామేశ్వర్ అష్రాఫ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


