అక్షర న్యూస్ :రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జెడ్పీటీసీ ,ఎంపిటిసి లు మెజారిటీ సీట్లు సాధిస్తామని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా చిన్నకోడుర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు, మెట్టుపల్లి గ్రామానికి చెందిన ఉసికె సుగుణ కు , అల్లిపూర్ గ్రామానికి చెందిన కత్తి భారతవ్వలకు సీఎం ఆర్ ఎఫ్ చెక్స్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధి పేదలకు వరం అన్నారు . కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలోకి తీసుకెళ్లాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలోకి తీసుకెళ్లే విధంగా ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో అన్ని గ్రామాలలో పర్యటిస్తామన్నారు.పార్టీని బలోపేతం చేసేవిధంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కోరిమి రాజు , మీసం రాజు, కల్లూరి నర్సింలు,బర్లా స్వామి, రెడ్డి మహేందర్ రెడ్డి, ఒగ్గు కిషన్, ముకుందం,యేసు, మహేష్ ,స్వామి, రాజు, సాయి, ఉడుత ఎల్లయ్య, మీసం మహేందర్,ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.


