అక్షర న్యూస్ :చిన్నకోడుర్ మండలం అనంత సాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, చిక్కుడుకాయ, సాంబారు, గుడ్డు వంటలను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం అందించి రుచికరంగా వంటా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ మరియు ఫుడ్ చెకింగ్ టిచర్ ను ఆదేశించారు. పాఠశాల సమయ వేళల్లో విద్యార్థుల ను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా ఉపాధ్యాయులు చూసుకోవాలి. విద్యార్థుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. రోజు ఆహారం రుచికరంగా ఉంటుందా, సరిపోతుందా అని ఆరా తీశారు. నాణ్యమైన ఆహార పదార్ధాలను వాడుతూ రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం ప్రాంగణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అడ్మిషన్లు పెంచేలా బోధన జరపాలని పిల్లలకు టిచర్ చెప్పింది శ్రద్ధగా వినేలా బోధించాలని తెలిపారు. మెను ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు.



