• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు మరియు ఆటో డ్రైవర్లకు ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది..

Bypentam swamy

Jan 4, 2026

అక్షర న్యూస్ : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని
ఈ రోజు సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారి ఆదేశానుసారం ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ మరియు 9 మంది సిబ్బంది తో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉదయం తొమ్మిది గంటలనుండి మధ్యానం ఒకటి గంటల వరకు హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు మరియు ఆటో డ్రైవర్లకు ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ , ఏఎంవిఐ శ్రీకాంత్ రెడ్డి,కానిస్టేబుల్ విక్టోరియా ,హోమ్గార్డ్స్ అష్రఫ్, రామేశ్వర్ వెంకటేష్ మరియు నరేష్ లు మేడికల్ ఆఫీసర్స్ డాక్టర్ మనోహర్ డాక్టర్ మానస మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

ఇందులో భాగంగా ఎంవీఐ శంకర్ నారాయణ గారు మాట్లాడుతూ డ్రైవర్ లు ఆరోగ్య విషయం లో జాగ్రత్తలు పాటించాలని ధూమపానం మధ్య పానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ,శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారికి చాలా అవసరం అని పేర్కొన్నారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..