అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీలు కలిపి మొత్తం 198 పోస్టుల కోసం ఇటీవల ప్రకటన విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www.tgprb.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలు ఇదే వెబ్‌సైట్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
