అక్షర న్యూస్:పీసీసీ పిలుపుమేరకు నేషనల్ హెరాల్డ్ కేసులో మన ప్రియతమ నాయకులు ఏఐసిసి అగ్ర నేతలు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ అక్రమంగా పెట్టిన తప్పుడు కేసులను నిన్న సుప్రీం కోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో , దాదాపు పది సంవత్సరాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బిజెపికి వ్యతిరేకంగా, ఈ రోజు సిద్దిపేట లో పొన్నాల దాబా రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద బిజెపి కార్యాలయా ముట్టడి మరియు బిజెపి ఆఫీస్ ముందు ధర్నా మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఇట్టి కార్యక్రమo డీసీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారి నాయకత్వం షుమారు 300 తో ముట్టడి మరియు ధర్నా కార్యక్రమo దిగ్విజయంగా జరిగింది . ముట్టడి అనంతరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్లగా , అక్కడ కూడా ధర్నా కార్యక్రమo కొనసాగింది .
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ED, IT లాంటి సంస్థలను వారి పార్టీ సంస్థలు గా మార్చుకుని , వాటిని ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటూ , గవర్నమెంట్ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని అన్నారు.
ఇట్టి కార్యక్రమo లో డీసీసీ అధికార ప్రతినిధి ముత్యాల బుచ్చి రెడ్డి , జిల్లా ఆర్టీఏ మెంబెర్ సూర్య వర్మ , కౌన్సిలర్ రియాజుద్దీన్ , నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి నాయిని నర్సింహా రెడ్డి , మద్దెల సోమేశ్వర రెడ్డి , తడూరి శ్రీనివాస్ గౌడ్ , గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ , ఏఎంసీ చైర్మన్ మోహన్ , శ్రీధర్ , ఏఎంసీ మిరుదొడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ , గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆజాద్, సిద్దిపేట పట్టణ మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎల్లవ్వ , నాయకులు వంగరి నాగరాజు , నిజాముద్దీన్ , ఇబ్రహీం , అహ్మద్ , కనకరాజు , శ్రీను , రవి తదితరులు పాల్గొన్నారు..

