అక్షర న్యూస్: *ఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ “108” సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ గారి సమక్షంలో 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ రమేష్ లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకు మరియు ఏఎన్ఎంస్ కి అపస్మారక పరిస్థితుల్లో వున్నా వారికి ( కార్డి్యాక్ అరెస్ట్) సమయంలో ప్రాణాపాయం నుండి ఎలా కాపాడలో సిపిఆర్ ప్రక్రియ( కార్డియో పాల్మనరీ రెససిటేషన్ )ద్వారా అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఊమ్మడి మెదక్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జాన్ షాహిద్ గారు. మరియు సిద్దిపేట జిల్లా కోర్డినేటర్ హరిరమా కృష్ణ గారు పాల్గొని ఎటువంటి అత్యవసర పరిస్థితులలో ఐనా 108 అంబులెన్సు, మరియు 102 అమ్మఒడి సేవలను, వినియోగించు కోవాలని మరియు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్ డాక్టర్ రజిని గారు, హెచ్ఈఓ రమణ గారు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు…*
