అక్షర న్యూస్ : కొత్త ఆహార భద్రత కార్డుల జారీ సంబంధించిన విది విధానాల గురించి,రైతు భరోసా పథకంలోని ముఖ్యంశాలను అనగా రైతు భరోసా సహాయం ఎకరాకు 12000 పెంచబడిందని, భూభారతి పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించడం జరుగుతుందని రైతు భరోసా పథకం 26 జనవరి 2025 నుండి అమలు చేయబడుతుందని,DBT (Direct Beneficiary Tranfer) పద్ధతిలో సహాయం చేయబడుతుందన్నారు.
లబ్ధిదారుల వార్డు సభలు నిర్వహించి ఎంపిక మరియు జాబితా ప్రక్రియను వివరించారు.
కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలను వివరించడం జరిగింది. SEEEPC సర్వే ఆధారంగా ఆన్లైన్ డేటా ప్రకారం రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడతాయని మరియు ముసాయిదా జాబితాను వార్డు సభలో ప్రదర్శించి, వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను ఆ యొక్కశాఖకి పంపబడతాయన్నారు.
అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక ఆహార భద్రత కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార భద్రత కార్డులో సభ్యుల చేర్పులు మరియు తొలగింపులు చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల వార్డు సభలు నిర్వహించి ఎంపిక మరియు జాబితా ప్రక్రియను వివరించారు.