అక్షర న్యూస్ :సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతు….ప్రజావాణి కార్యక్రమం పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.
ఎంతో నమ్మకం తో జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలను విన్నవించుకోని పరిష్కారానికి ప్రజావాణి కి వస్తారని అంతే నమ్మకంగా అర్జిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించినచో వారికి న్యాయం చేసిన వాళ్లం అవుతామని జిల్లా అధికారులకు సూచించారు. ప్రజావాణి లో భూ సంబందిత, రెండు పడక గదుల ఇళ్ల, ఆసరా పింఛన్లు ఇతర మొత్తం కలపి 74 దరఖాస్తులు స్వీకరించారు.
ఇట్టి కార్యక్రమం లో డిఆర్ఓ నాగ రాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


