అక్షర న్యూస్ : పందుల దొంగతనం కేసును త్వరగా చేదించినందుకు తెలంగాణ ఎరుకల సంఘం తరఫున పోలీస్ కమిషనర్ మేడమ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో దొంగతనం జరిగిన పందులను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడమ్ గారి చొరవతో పోలీస్ అధికారులు ఐదు కేసులలో పందులను మరియు డబ్బులను రికవరీ చేసినందుకు తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కుత్తడి రాములు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మండలాపురం గోపాల్ మరియు మండల జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ మేడం గారిని కలిసి పూల బొకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ కుకునూరుపల్లి, దుబ్బాక, త్రీటౌన్, గౌరారం, మర్కుక్, పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఐదు పందుల దొంగతనాల కేసులలో ఈరోజు కుకునూరు పల్లి పోలీసులు 33 పందులను, మరియు 75 వేల నగదు రూపాయలను రికవరీ చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగింది.



