అక్షర న్యూస్ :అభయ యాప్ గురించి సిద్దిపేట పట్టణంలో మేం చౌరస్తాలలో ప్రజలకు విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ట్రాఫిక్ పోలీసులకు అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్.
జిల్లాలో ఆటోలో ప్రయాణించే మహిళలు మరియు యువతులు మరియు విద్యార్థినిలకు రక్షణ కవచంగా అభయ ఉంటుంది.
ఆపద సమయంలో అత్యవసర సమయంలో మీ ప్రయాణానికి ఇబ్బంది అనిపించగానే మరియు ఆటో డ్రైవర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉన్న వెంటనే అభయ యాప్ వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ అభయ యాప్ ను విద్యార్థినీ విద్యార్థులు మహిళలు ఆటోలో ప్రయాణించే ప్రయాగ్నీకులు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు చేయవలసిన భద్రతా గురించి చేయవలసిన చర్యలు.
ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని సంఘటనలను ఎదుర్కొన్నపుడు ఆటోకి ముద్రించిన “క్యూ అర్ కోడ్”ను స్కాన్ చేయాలని స్కాన్ చేయగానే వెంటనే డ్రైవర్ ఫోటో,వివరాలతో పాటుగా వాహనంకి సంబంధించిన వివరాలు వస్తాయి స్కాన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ యాప్ లో ఎంట్రీ చేసి ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.
ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ సిద్దిపేట పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది, ఆటోలో ఎక్కినప్పటినుండి దిగేంతవరకు కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బంది ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమీపంలో పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగానే ఆ పోలీసులు అక్కడికి వెళ్లి తగు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మహిళలు పిల్లలు ప్యాసింజర్లు ఆటో ఎక్కే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి ఆటో డ్రైవర్ వివరాలు నెంబర్ తో యుక్తంగా వస్తాయి ఆటోలో ఏదైనా విలువైన వస్తువులు మరిచిపోతే వెంటనే ఆటోను ట్రేస్ అవుట్ చేసి అప్పగించడానికి వీలుంటుంది.
గతంలో ఆటో డ్రైవర్ ఏదైనా పోలీస్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే థిస్ ఆటో నాట్ సేఫ్, అనే రెడ్ సిగ్నల్ వస్తుంది ఇది ప్రయాణికులకు సేఫ్ జర్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
ఆటో డ్రైవర్లు ఏదైనా నేరాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన సిసి కెమెరాల ద్వారా కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు
ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్,హిట్ అండ్ రన్ చేసిన ఈ అప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు.
అదేవిదంగా ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వాహనం కి రేటింగ్ కూడా ఇవ్వవచ్చు అన్నారు.



