అక్షర న్యూస్ : ఈనెల 17 మరియు 18 తేదీలలో నిర్వహించనున్న టిజిపిఎస్సి గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహణకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 13401 మంది అభ్యర్థులు గ్రూప్ త్రీ పరీక్షకు హాజరుకానున్నారని ఇందుకు సిద్దిపేట పట్టణంలో మొత్తం 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
పరీక్ష నిర్వహణకు 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 37 మంది చీఫ్ సూపరింటిండెంట్లు, 10 మంది రూట్ అధికారులు, 5 గురు ప్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లును నియమించామన్నారు. 17 వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8:30 గంటలనుండి 9:30 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందనిఅన్నారు.
అలాగే 2వ పేపర్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని అభ్యర్థులను మధ్యాహ్నం 2:00 గంటల నుండి 2:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని అభ్యర్థులు నిర్ణిత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.
సెల్ ఫోన్లు, వాచీలు తదితర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం కుదరదు కాబట్టి అభ్యర్థులు ఎవరు ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకురావద్దని అన్నారు.
18వ తేదీ సోమవారం 3వ పేపర్ ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థుల సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరై ప్రశాంతంగా పరీక్షలను రాయాలని అన్నారు.