అక్షర న్యూస్ :హుస్నాబాద్ మార్కెట్ యార్డు లో సంక్రాంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల ఫైనల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్..
మహిళలు వేసి ముగ్గులను పరిశీలించి అభినదించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
1. కొయ్యడ లక్ష్మీ (మహమ్మద పూర్)
2. 2.ఎదులపూర్ లక్ష్మీ (పోతారం ఎస్) ,
3. రమాదేవి (జనగామ)
4. గాదె మమత (సీతారాంపూర్)
5. పుధరి అర్చన
వీరితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతుల ప్రధానం..
రోడ్ సేఫ్టీ పై రోడ్డు నిబంధనలు పాటించాలని వేసిన ముగ్గు వేసిన హుస్నాబాద్ కి చెందిన కొంపల్లి మౌనిక ను ప్రత్యేక అభినందించి బహుమతి ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమవతి, సిపి రష్మీ పెరుమాళ్,మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సతీమణి మంజుల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్డీవో లు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు
*మంత్రి పొన్నం ప్రభాకర్*
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏడు మండలాల్లోని 173 గ్రామాల్లో మూడవ తేదీ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది.. అందులో ఐదుగురిని గుర్తించి వారికి ప్రైజ్ ఎంపిక చేయడం జరిగింది..
ఈరోజు ఏడు మండలాలు ,టౌన్ నుండి 45 మందికి ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది.. 42 మంది పాల్గొన్నారు..
ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు..
హుస్నాబాద్ ,కరీంనగర్ ,హుజూరాబాద్ ఆర్డీవోలు వారే స్వయంగా పరిశీలించి ముగ్గులను పరిశీలించారు.. వారే విజేతలను ఎంపిక చేశారు
మన సంస్కృతి సంప్రదాయాల్లో ముగ్గులు ఒక భాగం.. నేటి తరం ముగ్గులు వేయడం మర్చిపోతున్నారు..
మా కుటుంబంలో అందరూ కలిసి సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేస్తుంటారు..
ముగ్గుల పోటీలు ,హెల్త్ క్యాంప్ లో
ప్లాస్టిక్ ప్లేట్స్ వాడినందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కి ,వైస్ చైర్మన్ బంక చందు కి 5 వేల రూపాయలు,మున్సిపల్ కమిషనర్ కి వెయ్యి రూపాయల ఫైన్ విధించాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్న..
స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశాం..దానిని ప్రతి ఒక్కరు వాడాలి..
ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం కోసం కృషి చేస్తున్నాం.. ప్లాస్టిక్ వాడితే కాన్సర్ సంబంధిత వ్యాధులు వస్తాయి..
ముగ్గుల పోటీల విజేతలకు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు ..
వచ్చే సంవత్సరం ప్రతి ఊరిలో ముగ్గు వేసిన మహిళకు ప్రోత్సాహం అందించాలి..




