• Sat. Mar 15th, 2025

అక్షర న్యూస్ : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి..

Bypentam swamy

Nov 8, 2024

అక్షర న్యూస్ : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా పర్యవేక్షించాలని మండల ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులతో వరి ధాన్యం కొనుగోలు పై ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 417 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఇంకా ఎక్కడైనా వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించక పోతే వెంటనే ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చిన వెంటనే ఆరబెట్టి నిర్ణీత తేమశాతం రాగానే తూకం వేసి గన్ని సంచుల్లో నింపి ఆలస్యం చేయకుండా మిల్లులకు పంపించాలని ఆన్లైన్ చేసి రైతులకు త్వరగా పేమెంట్ జరిగేలా చూడాలని అన్నారు. సన్నరకం వడ్లకు 500 రూపాయలు అదనంగా బోనస్ ఉన్నందున అవసరమైతే సన్న రకం ధాన్యం కొనుగోలుకు అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సన్నధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు, గన్ని బ్యాగులు, మాశ్చరైజర్ మిషన్లు అన్నింటిని సంపూర్ణంగా ఉపయోగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నా

రు.

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..