బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : యాదగిరిగుట్ట.. TTD తరహాలో టెంపుల్‌ బోర్డు..

అక్షర న్యూస్ : యాదగిరిగుట్ట.. TTD తరహాలో టెంపుల్‌ బోర్డు..

అక్షర న్యూస్ :యాదాద్రి ఆలయ అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. TTD తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న..భూసేకరణ పూర్తిచేయాలన్నారు. ఆలయ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని రేవంత్ ఆదేశించారు.

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ తరహాలో యాదగిరిగిటుట్ టెంపుల్ బోర్డు ఉండెలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి ఆద్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

యాదగిరిగుట్టలో గోశాలలో గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకు రావాలని అధికారులను సూచించారు. గో సంరంక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. యాదగిరిగుట్ట కొండపై గతంలో భక్తులు నిద్ర చేసేందుకు అవకాశం ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కొండ్ర నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సోవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని తేల్చి చెప్పిన సీఎం.