అక్షర న్యూస్ : జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సికింద్రాబాద్ చెందిన Mrs. ఇండియా ఎనర్జిటిక్ అవార్డు గ్రహీత డాక్టర్ అనురాధ కోత్వార్ గారిని ఎన్నుకున్నట్లు జై గణేష్ భక్తి సమితి జాతీయ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ స్టేట్ సమితి అధ్యక్షులు జైన్ కుమార్ చారి, తెలంగాణ ఎమ్మెల్సీ గౌరవ అధ్యక్షులు శ్రీ దయానంద్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర యువజన వైస్ చైర్మన్ తలారి నవీన్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ విజయ రంగారావు, మరియు భువనేశ్వరి దేవి కమ్మరి మహేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికాంత్, రాష్ట్ర కార్యదర్శి బి జ్యోతి, తెలంగాణ రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలు వి శ్రీదేవి గౌడ్ ,జై గణేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్.పెంటం స్వామి బుధవారము తెలియజేశారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మట్టి వినాయకుడు ప్రతిష్టించాలని అందరు తెలియజేస్తూ ఉచిత మట్టి వినాయకుని పంపిణీ చేస్తూ ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు గత 5 సంవత్సరాల నుండి గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు సహకరించిన ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించి నాపై మరింత బాధ్యతలు పెంచారు సమస్త ఆశయాలు నెరవేర్చడానికి యువతలో భక్తి భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని తెలియజేశారు మట్టి వినాయకుని పెట్టండి పర్యావరణ కాపాడండి అలాగే జై గణేష్ నామములను రాయడం సంస్కృతి సంప్రదాయాల రక్షణ కొరకు మన పండగల రక్షణ కొరకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు జై గణేష భక్తి సమితి రాష్ట్ర కమిటీకి మరియు సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు