అక్షర న్యూస్ : తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ అధ్యక్షులు కొత్వల్ దయానంద్ గారి నేతృత్వంలో నేడు
తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డ్స్ కి ఉన్న ప్రధాన సమస్యలలో కానీ ఇతరత్రా సమస్యలల్లో బాధపడుతున్న తెలంగాణ హోంగార్డ్స్ కి ఉచిత న్యాయపరమైన సలహాలు సూచనలు అందించే విధంగా
తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్స్ కి ఉచితంగా న్యాయపరమైన సమస్యలు పరిష్కారాలు అందించే విధంగా డాక్టర్ ఎన్ సునీల్ బాబు హైకోర్టు న్యాయవాది ని హోంగార్డ్స్ అధ్యక్షులు కొత్వాల్ దయానంద్ రాష్ట్ర హోంగార్డుసు తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాండూరు శాసనసభ్యులు మన్యశ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆఫీసులో హోంగార్డ్స్ న్యాయపరమైన ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్ సునీల్ బాబు ని ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఘనంగా శాలువతో సత్కరించడం జరిగింది.
అలాగే భవిష్యత్ కార్యచరణ లో హోంగార్డ్స్ ప్రధాన సమస్యలలో ఇతరేతరా సమస్యలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా నిర్వహిద్దామని హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి చెప్పారు.


