• Sun. Feb 1st, 2026

అక్షర న్యూస్ : తెలంగాణలో టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Bypentam swamy

Dec 18, 2024

అక్షర న్యూస్ :తెలంగాణ టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ 2024 డిసెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ తెలం గాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవం బర్,20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. దీనికి దాదాపు 2,75,773 మంది అభ్యర్థులు తెలం గాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ టెట్ ఎక్సమ్ పరీక్షలు జనవరి 2 నుంచి నిర్వహించినట్లు ప్రభుత్వం వెలువరించింది.

ఈ టెట్ పరీక్షను జిల్లాల వారీగా పది రోజుల పాటు 20 సెషన్స్‌లో నిర్వహించ నున్నారు. జిల్లాల వారీగా ఒక్కో రోజు ఆయా జిల్లాలో ఉదయం సాయంత్రం రెండు స్టేషన్లలో పరీక్షను నిర్వహిస్తారు.

మొదటి సెషన్ ఉదయం 9.00 నుంచి ఉదయం 11.30 వరకు జరగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతుంది.

టెట్‌ 2024 డిసెంబర్‌ పూర్తి షెడ్యూల్‌ ప్రకారం..

అక్షర న్యూస్ : రోడ్డు భద్రత వారోత్సవాళ్ల

*జనవరి 2 తేదీన సోషల్ స్టడీస్ పేపర్ పరీక్ష

*జనవరి 5 తేదీన సోషల్ స్టడీస్, మాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష
*
జనవరి 8, 9, 10 తేదీల్లో లాంగ్వేజ్ పేపర్స్ పరీక్ష

*జనవరి 11 తేదీన సోషల్ స్టడీస్, మాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష

*జనవరి 12 తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష

*జనవరి 18 తేదీన పేపర్ 1 పరీక్ష

*జనవరి 19, 20 తేదీలలో మాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

పైన తెలిపిన తేదీల్లో జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ఈ మేరకు అభ్యర్థులు ప్రిపేర్ గా ఉండేలని అధికారులు సూచించారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్ల ను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు హల్ టికెట్లలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.