బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారు: హరీశ్‌రావు..!!

అక్షర న్యూస్ : రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారు: హరీశ్‌రావు..!!

అక్షర న్యూస్ :ధర్నాల పేరుతో రోడ్లపై సర్కస్‌ ఫీట్లు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. అదానీ.. ప్రపంచం ముందు భారతదేశం పరువు తీశారని రేవంత్‌రెడ్డి అంటున్నారు.

అదానీతో చేతులు కలిపి సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీయలేదా.. అని విమర్శించారు.

”తెలంగాణలో వివిధ సంస్థల ఏర్పాటు కోసం అదానీతో సీఎం రేవంత్‌ రెడ్డి రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. రూ.100 కోట్లు ఎలా వాపస్‌ ఇచ్చావో.. ఈ రూ.12,400 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకుని నిజాయతీ నిరూపించుకోవాలి.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

బయట కుస్తీ.. లోపల దోస్తీ అన్నట్టుంది రేవంత్‌రెడ్డి వ్యవహారం. రామన్నపేటలో డ్రైపోర్టుకు అనుమతిస్తే.. అక్కడ సిమెంట్‌ ఫ్యాక్టరీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. దాదాపు 12 గ్రామాల ప్రజలు సిమెంట్‌ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అదానీ సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం పోలీసులను పెట్టి ఆందోళనకారులను అణచివేస్తున్నారు.

పోలీసు పహారా మధ్య పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, అదానీ సంబంధాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని భారాస డిమాండ్‌ చేస్తోంది” అని హరీశ్‌రావు అన్నారు.