అక్షర న్యూస్ :రాజకీయంగా ఉనికినే కాపాడుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు నానా తంటాలు పడుతున్నారు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ కెసిఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు.
ఉద్యమకారులను అవమాన పరిచెల టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని కెసిఆర్ చేసిన దిక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని చెప్పుకోవడం బాధాకరం అని అన్నారు.
అమర వీరులను గుర్తు చేయకుండా ఏమో సాధించినట్లుగా దిక్ష దివాసులు నిర్వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క అమరుల కుటుంబానికి కేసీఆర్ న్యాయం చేయలేదు అని అన్నారు.
ఇప్పుడు ఏదో అధికారం పోగానే దీక్ష దివాస్ గుర్తొచ్చినట్లుగా బిఆర్ఎస్ నాయకులు హంగామా చేస్తున్నారు అని అన్నారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చిన కేసీఆర్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని అన్నారు. ఫామ్ హౌస్ పాలన నచ్చకే కేసీఆర్ ను పర్మనెంట్ గా కూర్చోబెట్టారు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో బిఆర్ఎస్ పార్టీ ఓర్వడం లేదని అన్నారు. అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
10 సంవత్సరాలలో ఉద్యమకారులను మరిచిన బీఆర్ఎస్ నాయకులు కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చినట్లుగా మతి భ్రమించి మాట్లాడుతున్నరు అని అన్నారు. ఇప్పటికైనా భ్రమ నుంచి బయటికి రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలకు తగు సూచనలు ఇచ్చి ప్రతిపక్ష నాయ.కులుగా ఇప్పటికైనా ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవాలి అని అన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నంగునూరు మండల అధ్యక్షులు తప్పెట శంకర్, పట్టణ కార్యదర్శి గ్యదారి మధు, యువజన పట్టణ అధ్యక్షులు గాయాజుద్దీన్ ,నజ్జు ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.



