• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య?..

Bypentam swamy

Nov 11, 2024

అక్షర న్యూస్ :నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ లో ఈరోజు ఉదయం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాయి ప్రియ పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలసి క్యాంపస్‌ వసతి గృహం లోనే ఉంటుంది.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్లు అల్పాహారం కోసం వెళ్లగా.. గదిలో సాయి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చే చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్‌ నోట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీయూకేటీకి ఇటీవల నూతన ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ నియామకం తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం తొలిసారి.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..
xr:d:DAFeYw8HCcU:2665,j:6689381759357013287,t:23112612