బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
ఆంధ్రప్రదేశ్

అక్షర న్యూస్ : పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉన్నా ఒప్పుకోను..

అక్షర న్యూస్ : పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉన్నా ఒప్పుకోను..

అక్షర న్యూస్ :ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పెన్షన్లు అందజేశారు. డిసెంబరు 1వ తేదీ ఆదివారం రావడంతో, నేడు నవంబరు 30వ తేదీనే ఇంటింటికీ తిరిగి పెన్షన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించారు.

చంద్రబాబు నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు దివ్యాంగ పింఛను రూ.15 వేలు అందజేశారు. అదే గ్రామంలో రుద్రమ్మ అనే వితంతు మహిళ ఇంటికి కూడా వెళ్లి పెన్షన్ అందజేశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించానని వెల్లడించారు. ప్రజల్లోని ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మెరుగైన పెన్షన్ల ద్వారా వితంతువులు, దివ్యాంగులకు అండగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

“అణగారిన వర్గాలకు అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. ఇప్పుడు రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ల రూపంలో ఈ ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పంపిణీ చేశాం.

అక్షర న్యూస్ : కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్…

పెన్షన్ మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకునే వెసులుబాటు కల్పించాం. పెన్షను లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఈ సౌకర్యం తీసుకువచ్చాం. దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదే. పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశాను.

పేదలకు అనేక రకాలుగా మేలు చేయాలని ఉంది… కానీ సమస్యలు చాలా ఉన్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ముందు వాటిని బాగు చేయాల్సి ఉంది” అని సీఎం చంద్రబాబు వివరించారు.