బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
జాతీయం

అక్షర న్యూస్: నిన్న నేను ఆడిన ఇన్నింగ్స్ మా నాన్నకు నచ్చలేదు: అభిషేక్ శర్మ

అక్షర న్యూస్: నిన్న నేను ఆడిన ఇన్నింగ్స్ మా నాన్నకు నచ్చలేదు: అభిషేక్ శర్మ

అక్షర న్యూస్:సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపించాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 141 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ శతకం తన తండ్రి రాజ్‌కుమార్ శర్మను పూర్తిగా మెప్పించలేకపోయిందని అభిషేక్ స్వయంగా వెల్లడించాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లలో అభిషేక్ ఒకడు. తన తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, తన తండ్రి చిన్నప్పటి నుంచి తన ఆటను చూస్తున్నారని, సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తుంటారని చెప్పాడు. “మా నాన్న నాకు తొలి కోచ్. ఆయన ముందు సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ఇది నా అత్యధిక స్కోరైనా, నాన్న మాత్రం నేను చివరి వరకు క్రీజులో ఉండాలని కోరుకున్నారు. అందుకే నిన్న నేను ఆడిన ఇన్నింగ్స్ ఆయనను సంతృప్తిపర్చలేకపోయింది. ఈ విషయంలో మెరుగుపర్చుకుంటాను” అని అభిషేక్ తెలిపాడు.

అంతేకాదు, తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… ఈ షాట్ కొట్టు, ఇలా ఆడాలి అంటూ తన తండ్రి గ్యాలరీ నుంచి సైగల ద్వారా సూచనలు చేస్తుంటాడని అభిషేక్ శర్మ ఆసక్తికర అంశం వెల్లడించాడు.

అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..

ఇక అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ, ఫామ్ గురించి ఆందోళన చెందవద్దని తన కుమారుడికి చెప్పానని గుర్తు చేసుకున్నారు. “క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటివి సహజం. గత మ్యాచ్‌లలో అతను రనౌట్ అయ్యాడు, కొన్నిసార్లు పరుగులు చేయలేకపోయాడు. కానీ ఈసారి ఆత్మవిశ్వాసంతో ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఆడతాడు” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ విజయం కోసం తప్పకుండా పరుగులు చేస్తానని అభిషేక్ తనకు చెప్పాడని రాజ్‌కుమార్ వెల్లడించారు.