బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
ఆంధ్రప్రదేశ్

అక్షర న్యూస్ : ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు

అక్షర న్యూస్ : ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు

అక్షర న్యూస్ :ఏపీ అసెంబ్లీలో నేడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సభ్యులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్లు లాంటివని అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు.

గత జలవనరుల శాఖ మంత్రికి టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి అడిగితే పర్సెంటా, హాఫ్ పర్సెంటా అని హేళనగా మాట్లాడారని మండిపడ్డారు.

గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 3.08 శాతం పనులే చేసిందని అన్నారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వెల్లడించారు. గత సర్కారు పోలవరంపై ఖర్చు చేసింది రూ.4,099 కోట్లేనని తెలిపారు.

అక్షర న్యూస్ : కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్…

ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, రెండేళ్లలో రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. డయాఫ్రం వాల్ నిర్మాణం 2026 మార్చి లోపు పూర్తవుతుందని అన్నారు. 2027 లోపు పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.

default